
పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 24వ ఆదివారం స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, కాలనీ వాసులు కాలనీలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న మురుగు కాలువలను శుభ్రం చేశారు. పారలు, కర్రలతో మురుగు కాలువలో నిండిన పూడికను, వ్యర్థాలను, ప్లాస్టిక్ కాగితాలను తొలగించి నీరు ప్రవహించేలా చేశారు. రోడ్ల పక్కన ఉన్న చెట్ల కొమ్మలను కట్టర్ తో కత్తిరించారు. రోడ్లపై చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించారు. దాదాపు గంట పాటు నిర్వహించిన శ్రమదాన కార్యక్రమంలో జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గోసికొండ అశోక్, ప్రధాన కార్యదర్శి బి.కమలాకర్, కోశాధికారి సత్యనారాయణ గౌడ్, కార్యదర్శులు కొంతం రాజు, సాయన్న, ఆలయ కమిటీ కోశాధికారి ఎర్ర భూమయ్య తదితరులు పాల్గొన్నారు.