
పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గురువారం విద్యార్థులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథులుగా ప్రత్యేక అధికారిని అన్నపూర్ణమ్మ, మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజు లు హాజరయ్యారు. ముఖ్యంగా విద్యార్థులకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. విద్యార్థులందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కళాశాల పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు. అనంతరం 24వ వార్డులో నిల్వ ఉన్న నీటిలో దోమల లార్వాలను నివారించేందుకు గంబుజియ చేప పిల్లలను వదలడం జరిగిందని కమిషనర్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రిక, కౌన్సిలర్లు ఆకుల రాము, శాల ప్రసాద్, భారతి రింగుల భూషణ్, మున్సిపల్ మేనేజర్ ఆయుమ్, సానిటరీ ఇన్స్పెక్టర్ గజనంద్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పూర్ణ మౌళి, సీనియర్ అసిస్టెంట్ శేఖర్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.