జేసీబీతో మురికి కాలువలు పరిశుభ్రం..

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని చిన్న ఎడ్గి గ్రామ పంచాయతి గ్రామములో ఎంపిడివో శ్రీనివాస్  ఆదేశాల మేరకు శనివారం నాడు జీపీ కార్యదర్శి షిండే విజయ్ కూమార్ మురికి కాలువలను శుఙ్రం చేయించడం జర్గింది. గత కొన్ని రోజులుగా మురికి కాలువలలో చెత్త చేదారం పేరుకు పోయి నీరమతా రోడు పైకి ప్రవహిస్తున్న క్రమంలో  గ్రామస్తులకు ఇబ్బందులు గురికావడంతో ఇటివలే గ్రామాన్ని మండల పరిషత్ అధికారీ  క్షేత్రస్థాయి పర్యటనలో  వెలుగు చుసారు. శనివారం నాడు ఎంపిడీవో సమక్షంలో  మురికి కాలువల శుభ్రత,  డ్రేన్స్ రోడ్ల వెంట ఉన్న  పిచ్చి  మెుక్కలు  తొలగించడం పనులు  చేపట్టడం జర్గింది. అదేవిధంగా ఎంపిడీవో  శ్రీనివాస్ మాట్లాడుతు  గ్రామాలలోని ఎఏపీఎస్ పనులు, అంగన్ వాడీ కేంద్రం, సిసిరోడు పనులు, ఎంపిపీఎస్ పాఠశాలలోని త్రాగునీరు వసతిని  పరీశీలించారు. అనంతరం పరిశుభ్రత పాటీంచే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇంటి పన్నులు వసుళ్లు చేయాలని, సీజనల్ వ్యాదులు ప్రభలకుండా బహిరంగా మలమూత్ర విసర్జన చేసే వారికి అవగాహన చేసి మరుగు దొడ్లు నిర్మించుకొని వాడుకోనే విధముగా అవగాహన చేయాలని జీపీ కార్యదర్శి షిండే విజయ్ కూమార్ ను ఆదేశించారు. ఎంపీడీవో తో పాటు జీపీ కార్యదర్శి తదితరులు పాల్గోన్నారు.