నవతెలంగాణ-మేడ్చల్
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ్ సర్వేక్షన్‌లో భాగంగా దక్షిణ భారతదేశంలో 25 వేల నుంచి 50 వేల జనాభా ఉన్న పట్టణాలలో మేడ్చల్ మున్సిపాలిటీకి ”క్లీనెస్ట్ సిటీ”గా రెండోస్థానం లభించిందని మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపిక నర్సింహా రెడ్డి, కమిషనర్ టీఎస్‌వీఎన్ త్రిల్లేశ్వర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అందుకు సహకరించిన మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. స్వచ్ఛ మేడ్చల్‌కు కషి చేసిన మున్సిపల్ సిబ్బందిని అభినందించారు. అనంతరం పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.