సఫాయి కార్మికులను పర్మినెంట్ చేస్తున్నట్లు ప్రకటించాలి

నవతెలంగాణ – నవీపేట్: సఫాయి కార్మికులను పర్మినెంట్ చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి శ్రీనివాస్ శనివారం డిమాండ్ చేశారు. సఫాయి సిబ్బంది 31 వ రోజు సందర్భంగా మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం డిప్యూటీ తాహసిల్దారు సవైసింగ్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా నాయక్ వాడి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అసెంబ్లీలో తీర్మానం చేసి సఫాయి కార్మికులను పర్మినెంట్ చేస్తున్నట్లు ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్క గంగారం, ఆంజనేయులు, నరేష్, నర్సారెడ్డి, సాయమ్మ, లలిత తదితరులు ఉన్నారు.