
నవతెలంగాణ – రెంజల్
ఈనెల ఐదు నుంచి నిర్వహిస్తున్న స్వచ్ఛ ధనం, పచ్చదనం కార్యక్రమాలను ఆయా గ్రామ పంచాయతీలలో విజయవంతం చేయాలని ఎంపీడీవో వెంకటేష్ జాదవ్ గ్రామ కార్యదర్శులకు సూచించారు. శనివారం పెంచల మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు, మొక్కలు నాటే కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో పరిసరాల పరిశుభ్రతతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాలు, ప్రతి ఇంటిలో మొక్కలు నాటే విధంగా చూడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ కార్యదర్శులు వివిధ శాఖలకు సంబంధించిన సిబ్బందిని తీసుకొని గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపరిండెడ్ శ్రీనివాస్, ఎంపీ ఓ రఫీ హైమద్, ఎంఈఓ గణేష్ రావు, ఏపీఎం చిన్నయ్య, ఆరోగ్య విస్తీర్ణ అధికారి కరిపి రవీందర్, గ్రామ కార్యదర్శులు రాజేందర్రావు, రాఘవేందర్ గౌడ్, శ్రీకాంత్, సిహెచ్ సాయి, సునీల్ యాదవ్, రాజు, సతీష్ చంద్ర, శివకృష్ణ, నవీన్, సలాం, బి రాణి, రజిని, షిభ, వెంకటరమణ, సాయిబాబా, అంగన్వాడి కార్యకర్తలు ఆశలు పాల్గొన్నారు.