గాంధీనగర్ లో స్వచ్ఛదనం పచ్చదనం

Cleanliness and greenery in Gandhinagarనవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్

హుస్నాబాద్ మండలంలోని గాంధీనగర్ గ్రామంలో శుక్రవారం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు మొక్కలు నాటారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక చందు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక చందు ,హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ , మార్కా ఆనీల్ గౌడ్, పార్టీ నాయకులు బొంగుని శ్రీనివాస్, పోలు సంపత్ ,గట్టు రాములు, గాజుల భగవాన్ ,గంపల శ్రీనివాస్, దానవీని రమేష్, బత్తుల మల్లికార్జున్ ,పోలు రాజయ్య , చింటూ కొడముంజ స్వామి, పోగుల కుమార్ తదితరులు పాల్గొన్నారు.