నవతెలంగాణ – కంఠేశ్వర్
స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఆర్.ఆర్ చౌరస్తా నుండి బొడ్డెమ్మ చెరువు వరకు కేంద్ర విద్యాలయం విద్యార్థులతో కలిసి ర్యాలీని సోమవారం నిర్వహించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ ప్రారంభిస్తూ ప్రజలలో అవగాహన కల్పించాలని చెత్త రహిత నగరానికి ప్రజలందరూ సహకరించాలని తడి పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని కోరారు. నగరంలోని అన్ని డివిజన్లలో ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చుట్టు పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని కోరారు. ప్రతి ఒకరు విధిగా మొక్కలు నాటాలని చెట్ల పెంపకానికి సహకరించాలని కోరారు. పరిసరాల పరిశుభ్రతతో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి పరిసరాలను ఇప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం ఈనెల తొమ్మిదవ తారీకు వరకు నిర్వహించినట్లు కావున ప్రతి ఒక్కరూ తమ విధిగా కార్యక్రమంలో పాల్గొనే విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మందమకానంద్, డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్, కార్పొరేటర్లు బట్టు రాఘవేందర్, సాయి వర్ధన్, మమత, ఇతర అధికారులు ప్రజలు పాల్గొన్నారు.