స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి 

Cleanliness and greenness program should be successful

– మండల ప్రత్యేక అధికారి మరియాన్న

నవతెలంగాణ – నెల్లికుదురు 
రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ధనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని మండల ప్రత్యేక అధికారి మరి అన్న ఎంపీడీవో బాలరాజు అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల్ లెవెల్ అధికారుల తో కలిసి శనివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాలలో పట్టణాలలో నిర్వహించే స్వచ్ఛ ధనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మండల్ లెవెల్ అధికారులు గ్రామ ప్రత్యేక అధికారులు పంచాయితీ కార్యదర్శులకు ఐసిడిఎస్  సూపర్వైజర్లకు అంగన్వాడీ టీచర్లకు ఆశ వర్కర్లకు కార్యక్రమం పై అవగాహన కల్పించి దేశానిర్దేశాన్ని సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాలరాజు ఎంపీఓ బానోతు పద్మ ఏ సి డి విజయలక్ష్మి వైద్యాధికారి ప్రియాంక పశు వైద్యాధికారి శ్రీనివాస్ మండల వ్యవసాయ అధికారి నెలకుర్తి రవీందర్ రెడ్డి, గ్రామ ప్రత్యేక అధికారులు పంచాయతీ కార్యదర్శులు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.