– రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో స్వచ్చదనం పచ్చదనం ఒక భాగం చేసుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త చెరువు వద్ద స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్,జిల్లా కలెక్టర్ మను చౌదరి పాల్గోన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈనెల 5 నుండి 9 వ వరకు రాష్ట్ర ప్రభుత్వం స్వచ్చదనం పచ్చదనం చేపట్టిందన్నారు. మన ఇల్లు మన పరిసరాలు ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలని భావిస్తామో, మనం నివసించే ప్రాంతాల్లో కూడా స్వచ్చ ధనం పచ్చదనం అలగే ఉండాలని బాధ్యత తీసుకోవాలన్నారు .భవిష్యత్ లో రాబోయే తరానికి ఎలాంటి పొరపాటు లేకుండా ఆరోగ్యంగా బతకడానికి చర్యలు తీసుకోవాలనీ ప్రతిజ్ఞ చేయాలన్నారు.ఈరోజు చెప్పలేని వింత వ్యాధులు వస్తున్నాయని, మొక్కలు పెంచితే ఆరోగ్యమైన జీవితం గడుపుతారన్నారు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన ప్రజల సహకారం లేకుంటే కార్యక్రమాలు విజయవంతం కావన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ మొక్క నాటాలని పిలుపునిచ్చారు. మీ పుట్టిన రోజూ , పెళ్లి రోజు పెద్దల జ్ఞాపకాల రోజు మొక్కలు నాటుకోవాలన్నారు. కొత్త చెరువు ఎస్టిమేషన్ చేసి బ్రిడ్జి అభివృద్ధి చేసుకుందామన్నారు. ఎల్లమ్మ చెరువు కు రూ. 3 కోట్లు కేటాయించామన్నారు.ఎన్నికల వరకే రాజకీయాలని ఎన్నికల తర్వాత అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు హుస్నాబాద్ లో నియోజక వర్గంలో ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేసిన పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. సంజయ్ గాంధీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆరోజే చెప్పారని పేర్కొన్నారు.వికారాబాద్ లో నిజాం హయంలోనే ఆరోగ్యకరమైన మొక్కలు నాటారు..అక్కడ ఏ రోగాలు రాకుండా ఆ గాలి మంచి ప్రభావాన్ని చూపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అర్ డి ఓ రామ్మూర్తి, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.