స్వచ్ఛదనం – పచ్చదనంలో భాగస్వాములు కావాలి

Purity – Want to be partners in greenness– జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి సాయ గౌడ్ 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు  భాగస్వాములు కావాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి సాయ గౌడ్ పిలుపునిచ్చారు.  మంగళవారం మండల కేంద్రంలో మండల ప్రత్యేక అధికారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సాయి గౌడ్ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆసుపత్రి పరిసరాల్లో సిబ్బంది, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఆరోగ్య కేంద్రం ఆవరణలో పారిశుద్ధ్యన్ని పరిశీలించారు. అనంతరం  బతుకమ్మ చెరువు వద్ద గ్రామ స్థాయి సభ్యులతో పరిశీలన జరిపి అనేక సూచనలు చేశారు.ఉప్లూర్   గ్రామ పంచాయతీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛతనం పచ్చదనంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై  మొక్కలు నాటాలని, ఇండ్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. స్వచ్ఛదానం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఆయా గ్రామాల్లో అధికారులు, గ్రామస్తులు ర్యాలీలు నిర్వహించి మొక్కలు నాటారు.కార్యక్రమంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, ఐకెపి ఎపిఎం కుంట గంగారెడ్డి, ఆయా గ్రామాల గ్రామస్థాయి నిర్వహణ కమిటీ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు  పాల్గొన్నారు.