‘స్వచ్ఛదనం – పచ్చదనం’9వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు

Special programs on 'Cleanliness - Greenness' till 9thనవతెలంగాణ – మల్హర్ రావు
స్వచ్ఛదనం పచ్చదనం’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సోమవారం నుంచి ప్రారంభించింది.కార్యక్రమంలో భాగంగా మండలంలోని 15 గ్రామపంచాయతీల్లో ఈనెల 9వ తేదీ వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు.వర్షాకాలం ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా స్వచ్ఛదనం- పచ్చ దనం కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని ఇటీవల అన్నిశాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించి, దిశానిర్దేశం చేశారు.
పారిశుధ్యంపై ప్రధాన దృష్టి
వర్షాకాలం కావడంతో పారిశుధ్య వ్యవస్థ అధ్వానంగా మారుతోంది. గ్రామాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. ప్రతీ గ్రామంలో సెగ్రిగేషన్ షెడ్లున్నా 90శాతానికి పైగా ఉపయోగించడం లేదు.డ్రైనేజీల్లో మురుగునీరు రోడ్లపై పారుతోం ది. గతేడాది శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి చాలా వరకు కూల్చకుండా వదిలేశారు. ఇప్పటికీ అందులో నివాసం ఉంటున్నారు. భారీ వర్షాలొస్తే అధికారులు వారిని అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. వర్షాకాలం లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నా యి. డ్రైనేజీల్లో పూడికతీత పూర్తిస్థాయిలో చేపట్టలేదు.
చేపట్టాల్సిన పనులు ఇవీ..
ఈనెల 5న ప్రజలకు స్వచ్చదనం- పచ్చదనం కా ర్యక్రమంపై అవగాహన కల్పించాలి. ప్రభుత్వ కార్యాలయాలు, కూడళ్లు, రోడ్లను శుభ్రం చేయాలి. ఇళ్లలోని చెత్తను సేకరించి సెగ్రిగేషన్ షెడ్డుకు పంపించాలి. మరుగుదొడ్లు లేని ఇళ్లను గుర్తించాలి. 6వ తేదీన తాగునీటి ట్యాంకులు శుభ్రం చేయాలి. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి. 7న గ్రామాల్లో  ముంపు ప్రాంతాల్లో మురుగు నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలి. మంచినీటి సర ఫరా వ్యవస్థల వద్ద మురుగునీరు లేకుండా చూడాలి. 8న ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి. గ్రామాల్లో జ్వర బాధితులపై సర్వే నిర్వహించాలి. వీధి కుక్కలను గుర్తించి యానిమల్ బర్త్ కంట్రోల్ కు తరలించాలి. ఇళ్లమధ్య నీరు నిలిస్తే ఆయిల్బాల్స్ వేయాలి. 9న శిథిలావ స్థకు చేరిన భవనాలను గుర్తించి, తొలగించాలి. రోడ్లకు ఇరువైపులా ఎండిపోయిన చెట్లను తొలగిం చాలి. మంగళవారం, శుక్రవారాలను డ్రైడేగా పాటించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలి.