
నవతెలంగాణ – మద్నూర్
ఆగస్టు 5 నుండి మద్నూరు ఉమ్మడి మండలంలో ప్రారంభమయ్యే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలను ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో సంబంధిత శాఖల అధికారులు కలిసి విజయవంతం చేయాలని మద్నూర్ ఎంపీడీవో రాణి మద్నూర్ ఎంపీ ఓ వెంకట నరసయ్య ఈ కార్యక్రమాలపై ప్రత్యేక సూచనలు చేశారు. మద్నూర్ మండల పరిషత్ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాలపై రోజు వారి నిర్దిష్ట కార్యక్రమాల విజయవంతం గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ డోంగ్లి మండల తాసిల్దార్ రేణుక చౌహన్ ఉపాధి హామీ ప్రోగ్రాం అధికారి పద్మ, ఇరు మండలాల తాసిల్దార్లు ఎంపీడీవో ఎంపీవో పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్లు పంచాయతీ కార్యదర్శులు ఆశ వర్కర్లు ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామ సమాఖ్య సభ్యులు అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.