నవతెలంగాణ-నస్పూర్
పరిశుభ్రత పాటించని హోటళ్ల్లు, బేకరీలు, తినుబండారాలు దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని, మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీష్ అన్నారు. మంగళవారం నస్పూర్ కాలనీ పరిధిలోని బెంగళూర్ బేకరీల్లో శుభ్రత లేకుండా తిను బండరాలను తయారు చేస్తు అలాగే బేకరీ వంట గదిలో చిమ్ని లేకపోవడంతో యజమానికి రూ.10 వేలు జరిమానా విధించారు. అనంతరం మున్సిపల్ కమీషనర్ మాట్లాడుతూ నిషేధించిన ప్లాస్టిక్ కవర్లను ఉపయోగించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.