నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ఈ నెల 5 నుండి ప్రారంభం కానున్న స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మందిరంలో మున్సిపల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పట్టణంలో పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.స్వచ్ఛదానం పచ్చదానం కార్యక్రమం ద్వారా అన్ని ఇంటి స్థాయిలో, కమ్యూనిటీ స్థాయిలో మొక్కలు నాటడం, వ్యర్థాలను వేరు చేసి సేకరించడం, రహదారులను ప్రజా స్థలాలను శుభ్రం చేయడం, పాఠశాలల్లో పరిశుభ్రతపై పోటీలు నిర్వహించడం, కుక్కల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలుపట్టణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించడానికి ఎంతగానో సహాయపడతాయని అన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. రోజూ చేపట్టవలసిన చర్యలను క్రమం తప్పకుండా అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.