– తరచుగా బస్సులో ప్రయాణించే వారి కోసం సరికొత్త విలువ-ప్రతిపాదన ‘బస్ పాస్’ను పరిచయం చేసింది
నవతెలంగాణ బెంగళూరు: ఫ్లిప్‌కార్ట్ కంపెనీ అయిన క్లియర్‌ట్రిప్, ఏప్రిల్ 2023లో తమ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి బస్ కేటగిరీలో 150% అసాధారణ వృద్ధిని నమోదు చేసింది. ఈ అద్భుతమైన వృద్ధి బస్సు ప్రయాణానికి ముఖ్యంగా టైర్ 2 నగరాల నుండి బలమైన డిమాండ్‌ను వెల్లడిస్తుంది. ఈ కేటగిరీలోని అవకాశాలపై ఆధారపడి , క్లియర్‌ట్రిప్ తమ కస్టమర్లకు బస్సు ప్రయాణాన్ని మరింత సరసమైనదిగా చేయడానికి పరిశ్రమలో మొట్ట మొదటి సారిగా ‘బస్ పాస్’ఆఫర్ ను తీసుకువచ్చింది. తరచుగా బస్సు ప్రయానాలను చేసేవారికి గణనీయమైన పొదుపు మరియు మెరుగైన విలువ-ఆధారిత ఆఫర్లను అందించడం బస్ పాస్ లక్ష్యంగా పెట్టుకుంది.
క్లియర్ట్రిప్లోని వినియోగదారుల డేటా వెల్లడించిన దాని ప్రకారం :
– గత 3 నెలల్లో 32% మంది వినియోగదారులు తమ బుకింగ్‌లను పునరావృతం చేశారు
– 15% మంది వినియోగదారులు మూడు నెలల్లో కనీసం మూడు సార్లు బుక్ చేసుకున్నారు
– బస్సు వినియోగదారులు 75% మంది బుకింగ్ చేసేటప్పుడు డిస్కౌంట్ కూపన్లను ఉపయోగిస్తున్నారు.
– ఇండోర్-భోపాల్, బెంగళూరు-హైదరాబాద్, ఇండోర్-పుణె, చెన్నై-మదురై మరియు కోయంబత్తూరు-బెంగళూరు అధిక రిపీట్ బుకింగ్‌లతో అగ్ర శ్రేణి మార్గాలుగా నిలిచాయి
బస్ బుకింగ్ చేసేటప్పుడు కస్టమర్లు రూ. 150 రుసుముతో బస్ పాస్‌ను కొనుగోలు చేయవచ్చు. బస్ పాస్ యొక్క ప్రయోజనాలు:
– కస్టమర్లు తమ ప్రస్తుత బుకింగ్‌పై కనీస ఆర్డర్ విలువ రూ. 300కి రూ. 100 (ఇతర కూపన్లను పొందడంతో పాటు) తక్షణ తగ్గింపును అందుకుంటారు.
– ఒక బస్ పాస్‌తో, వినియోగదారులు ఈ తగ్గింపు రేటుతో గరిష్టంగా 5 బుకింగ్‌లు చేయవచ్చు
– ఒక బస్ పాస్‌తో కస్టమర్లు రూ. 500 ఖర్చు ఆదా చేసుకోవచ్చు
– ప్రతి బస్ పాస్ కొనుగోలు తేదీ నుండి 90 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది
క్లియర్‌ట్రిప్ యొక్క చీఫ్ బిజినెస్ & గ్రోత్ ఆఫీసర్ అనూజ్ రాఠీ మాట్లాడుతూ, “గత సంవత్సరంలో, క్లియర్‌ట్రిప్ యొక్క బస్ కేటగిరీ చెప్పుకోదగిన రీతిలో 150% వృద్ధిని సాధించింది. మా కస్టమర్ల నిరంతరం అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా, లోతైన మార్కెట్ పరిశోధన ద్వారా మా ఉత్పత్తులను రూపొందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. క్లియర్‌ట్రిప్ ‘బస్ పాస్’ మా యూజర్ బేస్‌కు అసాధారణమైన విలువను మరియు సౌకర్యాన్ని అందిస్తుంది” అని అన్నారు.