సోషల్‌ మీడియా ప్రచారంపై గట్టి నిఘా

– అసోషల్‌ మీడియా ట్రాకింగ్‌ కేంద్రం ప్రారంభం
– అఎంసీఎంసీ నుండి అనుమతులు తీసుకోవాలి
– అకలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌.వెంకట్రావ్‌
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్‌
జిల్లాలో ఎన్నికలకోడ్‌ అమలులో ఉన్నందున సోషల్‌ మీడియాలో వచ్చే ప్రకటనలు, వార్తలపై గట్టి నిఘా పెంచామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌. వెంకట్రావ్‌ అన్నారు.మంగళవారం కలెక్టరేట్‌లో జీ-3 రూమ్‌లో సోషల్‌ మీడియా ట్రాకింగ్‌కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌తో కలిసి ప్రారంభించి మాట్లాడారు.సామాజిక మాద్యమాలైన ఫేస్బుక్‌, ఇన్‌స్ట్రాగామ్‌, వాట్సప్‌, యూట్యూబ్‌, ట్విట్టర్‌ తదితర సామాజిక మాద్యమాల్లో ప్రచారం ఎక్కువగా వస్తున్నందున ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు ఏర్పాటు చేసిన కేంద్రం ద్వారా సోషల్‌ మీడియా ఐటమ్స్‌పై ఎప్పటికప్పుడు ట్రాకింగ్‌ చేస్తూ తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.నియోజక వర్గాల వారీగా పరిశీలన తదుపరి ఆయా నియోజకవర్గాలకు సోషల్‌ మీడియా వార్తలు, ప్రకటనలు పంపిస్తామన్నారు.ఏర్పాటు చేసిన కేంద్రం ద్వారా ముందుగా అనుమతులు పొందాలని కలెక్టర్‌ సూచించారు. ఫిర్యాదుల కేంద్రం నుంచి యంత్రాంగం ఇంటర్నెట్‌ బేస్డ్‌ మీడియాలలో వచ్చే ఎన్నికల ప్రచారాలపై పర్యవేక్షణ చేస్తామన్నారు.ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై సోషల్‌ మీడియాలో వచ్చే వాటిని పరిశీలనలో తీసుకొని చర్యలు తీసు కుంటామని తెలిపారు.తదుపరి మీడియాసెంటర్‌, ఇంటిగ్రేటడ్‌ ఎలక్షన్‌ కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించి చెక్‌పోస్టులలో తనిఖీలు, సంబంధిత రికార్డులు అలాగే మీడియాసెంటర్‌లో చానల్స్‌ రికార్డింగ్‌ను పరిశీలించి అధికారులకు, సిబ్బందికి పెయిడ్‌న్యూస్‌, పెయిడ్‌ఆర్టికల్స్‌పై దిశానిర్దేశం చేశారు.ఎంసీఎంసీ నుండి పత్రికలు, ఛానళ్లు ప్రకటనలుకై అలాగే ఆయా పార్టీ అభ్యర్థులు ప్రకటనలు, పోస్టర్లు, పాంప్లెట్స్‌ల అనుమతులు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో సీఈఓ సురేష్‌,సీపీఓ వెంకటేశ్వర్లు, డీపీఆర్‌ఓ రమేశ్‌కుమార్‌,డీఐఈ మల్లేశం, ఏఓ సుదర్శన్‌రెడ్డి, సోషల్‌ మీడియా ట్రాకింగ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.