ముగిసిన ప్రజా పాలన ఆన్లైన్ దరఖాస్తు లు

– యంపిడిఓ రాములు నాయక్ 
నవతెలంగాణ – డిచ్ పల్లి
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 
గత నేలా 28నుండి జనవరి 6వరకు గ్రామాల్లో ప్రజల నుండి స్వీకరించిన ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్  కార్యక్రమం పూర్తి అయినట్లు యంపిడిఓ రాములు నాయక్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందల్ వాయి మండలంలోని 23గ్రామలకు గాను 12 వేల 552 దరఖాస్తులు వచ్చాయని రేయింబవళ్లు పంచాయతీ కార్యదర్శులు, ఐకెపి ఇతర అధికారులతో కలిసి ఆన్లైన్ కార్యక్రమం చేపట్టి సమయాని కంటే ముందుగానే పూర్తి చేయడంలో సఫలీకృతం అయ్యామని యంపిడిఓ రాములు నాయక్ వివరించారు. అనుకున్న సమయానికంటే ముందే పూర్తి చేయడానికి సహకరించిన పంచాయతీ కార్యదర్శులు,మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, ఐకెపి ఇతర ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు.ప్రభూత్వ ఆదేశాల అనుసరం ఎం కార్యక్రమం అయిన పూర్తి చేసే భద్యత అదికారులపై ఉంటుందని దాన్ని సక్రమంగా అమలు చేస్తామని సూచించారు.