బాలీవుడ్ కథానాయకుడు షారూఖ్‌ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘జవాన్’. సోమవారం మేకర్స్ ఓ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ని చూడగానే స్టన్నింగ్‌గా, యాక్షన్ ప్యాక్డ్ అవతార్‌లో నయనతార అందర్నీ సర్ప్రైజ్ చేస్తున్నారు. తుఫాను ముందు ఉరిమే మేఘంలా నయనతార కనిపించడాన్ని ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఫీల్ అవుతున్నారు.
లేడీ సూపర్‌స్టార్‌గా మెప్పించిన నయనతారకు బాలీవుడ్లో ఇది తొలి సినిమా. అలాగే మొట్టమొదటి సారి వెండితెరమీద షారుఖ్, నయనతార కాంబో నటిస్తోంది. నయనతార ఈ మూవీలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. గౌరీఖాన్ నిర్మాత. గౌరవ్‌వర్మ సహ నిర్మాత. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.