1.23 లక్ష మంది విద్యార్థులకు ‘సీఎం అల్పాహరం’

– జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ- జోగిపేట
ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న 1.23 లక్షల మంది విద్యార్థులకు సీఎం అల్పాహరాన్ని అందించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం జోగిపేటలోని బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం అల్పాహరాన్ని ఆయన పరిశీలించారు. విద్యార్థులకు అల్పాహరాన్ని వడ్డీంచడంతో పాటు నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల చదువు, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్దను చూపాలన్నారు. దసరా పండగా తర్వాత జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పహారం ప్రారంభమ వుతుందన్నారు. విద్యార్ధి దశ నుంచే ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం నాణ్యమైన పోషక విలు వలు కలిగిన అల్పాహరాన్ని అందిం చేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిం దన్నారు. అల్పాహరంపై ఎస్‌ఎంఎస్‌ కమిటీలు సమావేశాలను నిర్వహించి అవగాహనను కల్పించాలన్నారు. అల్పాహార భోజన విషయంలో ఉపా ద్యాయులు సమయపాలన తప్పని సరిగా పాటించి విద్యార్థులకు ఇబ్బం దులు కలుగకుండా చూడాలని ఆ యన హెచ్చరించారు. ప్క్రెవేటు పా ఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠ శాలలో చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించేందుకు కషి చేయా లన్నారు. అనంతరం పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు ఎ.మాణయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు డీఈవోను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కష్ణ, పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు నరోత్తమ్‌, సంఘం నాయకులు మంజ్యా నాయక్‌, మౌలనా, శ్రీనివాస్‌తో పాటు తదితరులు ఉన్నారు.