ఏడు నుంచి సీఎం కప్‌ క్రీడోత్సవాలు

CM Cup Games from seven– 36 ఈవెంట్స్‌లో పోటీలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఈ నెల ఏడు నుంచి జనవరి 2వరకు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్‌ 2024 క్రీడోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలంగాణ క్రీడా ప్రాదికార సంస్థ తెలిపింది. నెంబర్‌ వన్‌ క్రీడా రాష్ట్రంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా సీఎం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ విసత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రీడోత్సవాలను విజయంతం చేసేందుకు ఈ నెల 8 లోగా షఎషబజూ2024.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ నందు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. పోటీల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుని ప్రతిభను మదింపు చేసి, ప్రోత్సహిస్తారని సంస్థ తెలిపింది. మట్టిలో మాణిక్యాలను వెలికితీసీి , వారిని ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే దృడ సంకల్పంతో ఈ పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపింది. సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ కేటగిరీలలో పోటీలు జరుగుతాయని సంస్థ పేర్కొన్నది.