వేల్పూర్ మినీ స్టేడియంలో సీఎం కప్ క్రీడలు ప్రారంభం..

CM Cup Games start at Velpur Mini Stadium..నవతెలంగాణ – ఆర్మూర్
మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో సీఎం కప్ టోర్నమెంట్ పోటీల ను మంగళవారం  ఎంపీడీవో బాలకిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోకో కబడ్డీ వాలీబాల్ బాస్కెట్బాల్ అథ్లెటిక్స్ విభాగాలలో నిర్వహిస్తున్న క్రీడలలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనాలని అన్నారు  ప్రారంభోత్సవ మ్యాచ్ లో భాగంగా వేల్పూర్ మోతే జట్ల మధ్య నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రేణుక, ఎంపీ ఓ సాయిలు, ఏపీవో అశోక్, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు రాజన్న, ఫిజికల్ డైరెక్టర్లు మంచిర్యాల సురేష్ కుమార్, రాజేందర్, గంగారెడ్డి, రాజేశ్వర్, దేవ సుకన్య, సందీప్, వివిధ గ్రామాల పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.