నవతెలంగాణ -తాడ్వాయి
రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్- 24 క్రీడా పోటీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందున, శనివారం మండల వ్యాప్తంగా సీఎం కప్ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభించబడ్డాయి. అందులో భాగంగా కాటాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాణాల సుధాకర్ విద్యార్థులకు ఘనంగా క్రీడలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల నేడు, రేపు గ్రామపంచాయతీ స్థాయిలో క్రీడలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు క్రీడల ద్వారా మానసిక వివాసాన్ని పొందుతారని, క్రీడలు ఆరోగ్యంగా ఉండటానికి దుహదపడతాయన్నారు. సీఎం కప్ క్రీడలను అందరూ సద్వియం చేసుకోవాలని కోరారు.