దుబ్బాకలో సీఎం ఫ్లెక్సీ దహనం

CM flexi burning in Dubbakaనవతెలంగాణ – దుబ్బాక
అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీల్లో భాగంగా రైతు భరోసా ను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు గుండెల్లి ఎల్లారెడ్డి, దుబ్బాక పీఏసీఎస్ చైర్మన్ శేర్ల కైలాష్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు,ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం దుబ్బాక పట్టణ కేంద్రంలోని బస్టాండ్ ఎదుట సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోటోలతో కూడిన ఫ్లెక్సీని బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్ హామీల్ని నిలబెట్టుకోకపోవడమే కాకుండా తెలంగాణ రైతులని మోసం చేసిందని..రూ.2 లక్షల రుణమాఫీ సైతం అందరికీ చేయలేదని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగేదాకా వారి పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రొట్టె రాజమౌళి,కౌన్సిలర్లు ఇల్లెందుల శ్రీనివాస్,ఆస యాదగిరి,నాయకులు ఆస స్వామి,బండి రాజు,పల్లె రామస్వామి గౌడ్,గన్నె భూమిరెడ్డి,వేముల మల్లేశం గౌడ్,పడాల నరేష్,బీఆర్ఎస్ మండలాధ్యక్షులు బాణాల శ్రీనివాస్,సంజీవరెడ్డి,నిఖిల్ రెడ్డి,పర్స దేవరాజు,ఖలీల్,దేవుని రాజు,బోసు,పలువురు రైతులు పాల్గొన్నారు.