గిరి యువకుడిని సన్మానించిన సీఎం

గిరి యువకుడిని సన్మానించిన సీఎంనవతెలంగాణ-నార్నూర్‌
మండలంలోని బేతాల్‌గూడ గ్రామపంచాయతీ పరిధిలోని సోనాపూర్‌ గ్రామానికి చెందిన గిరిజన యువకుడు రాథోడ్‌ పృథ్విరాజ్‌ జాతీయ స్థాయిలో షూటింగ్‌ పోటీలో ప్రతిభ కనబరిచి నాలుగు పతకాలు సాధించాడు. ఈనెల 8న గోవాలో జరిగిన పదో అంతర్జాతీయ రైఫిల్‌ పిస్తొల్‌ షూటింగ్‌ లో రాథోడ్‌ పృథ్విరాజ్‌ ఒక బంగారు, రెండు సిల్వర్‌, ఒక బ్రాండ్‌ మెడల్‌ సాధించాడు. ఆయనను తెలంగాణ అసోసియేషన్‌ కార్యదర్శి భువనేశ్వరి గ్రామస్తులు అభినందించారు. నాలుగు పతకాలు సాధించిన పృథ్విరాజ్‌ను ఆదివారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శాలువాతో సన్మానించారు. వచ్చే నెలలో థాయిలాండ్‌లో జరిగే ఇంటర్‌ నేషనల్‌ పోటీలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. జరిగే మ్యాచ్‌కు అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు.