యూపీఎస్సీ టాపర్ అనన్య రెడ్డిని సన్మానించిన సీఎం

నవతెలంగాణ – హైదరాబాద్: యూపీఎస్సీ సివిల్స్ 2023 టాపర్ దోనూరి అనన్య రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.  ఏప్రిల్ 20వ తేదీ శనివారం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి తన కుటంబ సభ్యులతోపాటు వెళ్లి ఆయనను కలిసింది అనన్య. ఈ సందర్భంగా ఆమెను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆమెకు శాలువ కప్పి సన్మానించారు.  ఇటీవల ప్రకటించిన యూపీఎస్సీ సివిల్స్ 2023 ఫలితాల్లో జాతీయ స్థాయిలో పాలమూరుకు చెందిన అనన్య రెడ్డి మూడో ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే.