ఆరు పథకాలను అమలు చేస్తామని తాటి ఆకు చప్పులు చేస్తూ గ్రామ సభల పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాడని బిజెపి పార్టీ రాష్ట్ర నాయకుడు కర్ర శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు నూనె అనిల్ కుమార్ యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆరు గ్యారంటీ పథకాలు ప్రజలకు చేరకుండా అల్లంత దూరంలోనే ఉండిపోయాయని దుయ్యబట్టారు. సంవత్సర కాలంగా సర్వేలు చేస్తున్నారు తప్ప ఏ ఒక్క పథకం ఫలాలు లబ్ధిదారుడి ఇంటిలోకి వెళ్లలేక పోయిందన్నారు. ప్రజా దర్బార్ లో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను ఏ మేరకు పరిశీలించి వారికి న్యాయం చేసినారో తెలపవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేస్తూ ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుకుంటే బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఏ సమావేశంలోజనగామ జిల్లా ఉపాధ్యక్షుడు దొంగరి మహేందర్, మహబూబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు రఘురామ్ గౌడ్, అసెంబ్లీ కో కన్వీనర్ కోటేశ్వర్ రావు, మండల ప్రధాన కార్యదర్శి బూరుగు నవీన్ గౌడ్, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాపాక ప్రశాంత్, జిల్లా అధికార ప్రతినిధి పెండ్యాల గణేష్, సుమన్, సురేష్ ,జక్కుల సందీప్ తదితరులు పాల్గొన్నారు.