కానిస్టేబుళ్లు రోడ్డెక్కడానికి కారకుడు సీఎం

– మాజీ మంత్రి ,ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సీఎం రేవంత్‌ రెడ్డి కారణంగానే చరిత్రలో మొదటిసారి న్యాయం కోసం కానిస్టేబుళ్లు రోడ్డెక్కే పరిస్థితి దాపురించిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. హౌంశాఖ నిర్వహించడంలో విఫలమైన రేవంత్‌ రెడ్డి కారణంగానే పోలీసు కుటుంబాలు బయటకొచ్చాయని మండిపట్టారు. ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఏక్‌ పోలీస్‌ వ్యవస్థపై సీఎం రేవంత్‌ మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. 18రోజులకుగానూ నాలుగురోజులు కుటుంబంతో గడిపే పాత పద్దతిని కొనసాగించాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ,ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ వాణీ దేవి పాల్గొన్నారు.