” పేదల పెన్నిధి ” సీఎం కేసీఆర్

– తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర కన్వీనర్ బూర మల్లేశం
నవతెలంగాణ -దుబ్బాక రూరల్
“సీఎం కేసీఆర్ “మంచి మనసున్న పేదల పెన్నిధి అని తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర కన్వీనర్ బూర మల్లేశం అన్నారు. దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు చేసే ఆర్థిక సహాయం పథకంలో పద్మశాలీల అవకాశం కల్పించడం సంతోషకారమని వారు అన్నారు. బీసీలతో పాటు అనేక మంది పేద, మధ్య తరగతి చేనేత, పద్మశాలి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని.. గతంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం పక్షాన తాము తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోరామని గుర్తు చేశారు. పద్మశాలి, చేనేతల ఆర్థిక అభివృద్ధి కి ఈ పథకం దోహదపడుతుందన్నారు. పద్మశాలి ,చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల సహాయం అందించాలని తీసుకున్న నిర్ణయం గొప్పదన్నారు. ఈ ఆర్థిక సహాయం రావడానికి కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ , బీసీ సంక్షేమ శాఖ మంత్రి రంగుల కమలాకర్, ఆర్థిక మంత్రిహరీష్ రావు లకు వారు తెలంగాణ చేనేత పద్మశాలి పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేర్ల పురుషోత్తం ,రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీరామ్ రామకృష్ణ ప్రభు, రాష్ట్ర నాయకులు వనం సుమన్, వీరభద్రయ్య, అల్లి గోవింద్, గోలి జనార్ధన్, బాలరాజు, బాలయ్య యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.