తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే

– అభివృద్ధిని చూసి పట్టం కట్టండి మంత్రి సత్యవతి రాథోడ్‌
నవతెలంగాణ-మహేశ్వరం
గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతోందని గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. సోమవారం మహేశ్వరం మండల పరిధిలోని తుక్కుగూడలో గిరిజన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. మంత్రికి మద్దతుగా జరిగిన ఎన్నికల సభలో గిరిజనులు మంత్రులకు భారీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నాయకులు గిరిజనులను ఓటు బ్యాంకుగానే చూసారని, కానీ వారిని ఇప్పటి వరకూ పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్‌ గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చి గిరిజనులకు ఆత్మగౌరవం పెంపొందించేలా కృషి చేశారని తెలిపారు. వారికి పోడు భూములకు పట్టాలను అందించిన ఘనత సీఎం కేసీఆర్‌ దక్కుతుందన్నారు. రైతుబంధు ఎకరాకు రూ. 16 వేలను త్వరలోనే అందించనున్నట్టు వెల్లడించారు. సేవాలల్‌ భవనానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి రూ. 2 కోట్లు ఇచ్చారని ఆమె తెలిపారు. బీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. నియోజక వర్గమే ధ్యేయంగా ఆహర్నిశలు కృషి చేస్తున్న సబితా ఇంద్రారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. ఆనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో గిరిజనులకు స్వయం పాలనను అందించిన ఘనత సీఎం కేసీఆర్‌ దక్కుతుందన్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించి ఆదరించాలని ఆమె కోరారు. గిరిజన తండాలలో రోడ్లు, తాగునీటి వసతులు కల్పించామన్నారు. తండాల్లో గ్రామ పంచాయతీ భవనాలను పక్కా నిర్మిస్తున్నామని తెలిపారు. నియోజక వర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్న తనకు మరోసారి గెలిపించి సేవ చేసే భాగ్యం కలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితా హరినాథ్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్‌, తుక్కుగూడ మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ భవాని వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు బాదావత్‌ రవినాయక్‌, సప్పిడి లావణ్య రాజు ముదిరాజ్‌, బూడిద తేజస్విని శ్రీకాంత్‌ గౌడ్‌, ఎన్టీసెల్‌ నియోజవర్గం అధ్యక్షుడు లాచ్చానాయక్‌, బీసీసెల్‌ నియోజక వర్గం అధ్యక్షుడు మల్లేష్‌ యాదవ్‌, కందుకూరు జడ్పీటీసీ జంగారెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకుడు కూన యాదయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సురసాని సురేందర్‌రెడ్డి, తుక్కుగూడ బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జెల్లల లక్ష్మయ్య, ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ మాజీ సభ్యుడు చిలకమర్రి నర్సిహ్మ, నియోజకవర్గం ఉపాధ్యక్షులు హనుమగల్ల చంద్రయ్య, లక్ష్మినర్సింహారెడ్డి, నియోజకవర్గం కార్యదర్శి గుండెమోని అంజయ్య ముదిరాజ్‌, సర్పంచ్ల సంఘం అధ్యక్షులు థామస్‌రెడ్డి, యూత్‌ అధ్యక్షుడు సామ్యూల్‌ రాజు సర్పంచ్లు శివరాజునాయక్‌, సాలివీదానాయక్‌, మోతిలాల్‌ నాయక్‌, దేవుల నాయక్‌, మెగావత్‌ రాజ నాయక్‌, ఎస్టీ సెల్‌ మండల అధ్యక్షుడు అంగోతు గోపాల్‌నాయక్‌, నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్‌, కందిరమేశ్‌, మంత్రి రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.