
నవతెలంగాణ-మద్నూర్
స్వతంత్రం సాధించిన తర్వాత 60 ఏళ్ల కాలంలో అభివృద్ధి జరగని తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ 9 ఏళ్ల కాలంలోనే దేశంలోనే రాష్ట్ర సంక్షేమాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కెసిఆర్ దేనని మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సంగమేశ్వర్ తెలిపారు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి దేశంలోనే నెంబర్ వన్ గా ముందుకు తీసుకు వెళుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి మరింతగా కృషి చేస్తారని కెసిఆర్ చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు తప్పకుండా మరోసారి అధికారాన్ని కట్టబెడతారని పేర్కొన్నారు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ప్రజా ప్రతినిధులు అధికారులు ఎగరవేశారు తాసిల్దార్ కార్యాలయం ఎదుట పోలీస్ గౌరవ వందనంతో తాసిల్దార్ అనిల్ కుమార్ ఎంపీపీ కార్యాలయంలో వైస్ ఎంపీపీ జైపాల్ రెడ్డి మద్నూర్ సింగిల్ విండో కార్యాలయంలో వైస్ చైర్మన్ శంకర్రావు మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ సురేష్ వ్యవసాయ కార్యాలయం ఎదుట మండల వ్యవసాయ అధికారి రాజు పంచాయతీరాజ్ ఇంజనీర్ శాఖ కార్యాలయంలో డిప్యూటీ ఇంజనీర్ రవీందర్ బాబు పోలీస్ స్టేషన్లో ఎస్సై కృష్ణారెడ్డి రైతు భవనంలో రైతు కన్వీనర్లు సురేష్ హనుమాన్లు ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జాతీయ జెండాల ఆవిష్కరణతో ఘనంగా నిర్వహించారు