సీఎం కేసీఆర్‌ రాజీనామా

సీఎం కేసీఆర్‌ రాజీనామా– ఆమోదం తెలిపిన గవర్నర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల పలితాల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ తన రాజీనామా లేఖను సీఎంవో కార్యాలయ సిబ్బందితో గవర్నర్‌కు పంపించారు. సీఎం రాజీనామాను ఆమోదించిన గవర్నర్‌ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సూచించినట్టు సమచారం. కాగా ఏ ముఖ్యమంత్రి ఆయనా ఓటమి చవిచూసినప్పుడు ఆనవాయితాగా గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పిస్తారు. అయితే కేసీఆర్‌ మాత్రం గవర్నర్‌ను నేరుగా కలువకుండా సిబ్బందితో రాజానామా లేఖను పంపించడం చర్చనియాంశంగా మారింది. కాగా సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.