అమరుల కుటుంబాలను ఆదుకున్న సీఎం కేసీఆర్‌

– జెడ్పీచైర్మెన్‌ ఎలిమినేటి సందీప్‌ రెడ్డి
నవతెలంగాణ- భువనగిరిరూరల్‌
తెలంగాణ సాధనలో అమరులైన వారి కుటుంబాలను సీఎం కేసీఆర్‌ గౌరవించి ఆదుకున్నారని జెడ్పీచైర్మెన్‌ ఎలిమినేటి సందీప్‌ రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అమరుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. తొలుత కార్యక్రమంలో తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారి ఆత్మలకు శాంతి కలిగేలా రెండు నిమిషాలు మౌనం పాటించారు. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో దశలలో ఉద్యమాలు జరిగాయని, రాష్ట్ర సాధనలో ఎందరో అమరులయ్యారని, తెలంగాణ రాష్ట్ర సాధించుకున్న తరువాత ముఖ్యమంత్రి అమరుల కుటుంబాలను ఆదుకుని గౌరవించారన్నారు. జిల్లాకు చెందిన 33 అమరుల కుటుంబాలను ఆదుకున్నట్టు తెలిపారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో కాసోజు శ్రీకాంతా చారిది మొదటి త్యాగమని, మన జిల్లాకు చెందిన వారని అన్నారు. ముఖ్యమంత్రి హైదరాబాదులో అమరుల కుటుంబాలను సన్మానిస్తున్నారని, వారిలో శ్రీకాంతా చారి తల్లి ని కూడా సన్మానించుకుంటున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ పమేలా సత్పతి మాట్లాడుతూ 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని ఈనెల 2 నుండి 22 వరకు ఊరూరా, వాడవాడలా అందరికి తెలియపరుస్తూ సంబరాలు జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టరు దీపక్‌ తివారీ, అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివాసరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, ఎంపిపి నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్‌, జెడ్పీటీసీ బీరు మల్లయ్య, మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ చింతల కిష్టయ్య, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఆలేరురూరల్‌ : 1260 అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని ఎంపీపీ గంధమల్ల అశోక్‌ అన్నారు. .గురువారం మండలంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో తెలంగాణ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి తెలంగాణ కోసం చేసిన త్యాగాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జ్ఞాన ప్రకాష్‌ రావు. వైద్యాధికారి నవీన్‌ రెడ్డి ,జూనియర్‌ అసిస్టెంట్‌ మంజుల ,సీనియర్‌ అసిస్టెంట్‌ హవీలా, పంచాయతీ కార్యదర్శులు రాహుల్‌ రెడ్డి ,శ్రీకాంత్‌ రెడ్డి ,సర్వర్‌ నాయక్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని శర్బనాపురం గ్రామంలో తెలంగాణ అమరవీరుల దినోత్సవ వేడుకలనుఘనంగా నిర్వహించారు. అమరవీరుల చిహ్నం చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కనుకరాజు , ఉప సర్పంచ్‌ గడ్డమీద నరేష్‌, సీపీఐ(ఎం) మండల కార్యవర్గ సభ్యులు సత్య రాజయ్య, వార్డు సభ్యులు సుదగాని నరేందర్‌, మద్దెల భాగ్యలక్ష్మి ,బోడ విజరు, మద్దెల నర్సయ్య, సల్లూరి మల్లయ్య ,ఏదు రాములు, గ్రామపంచాయతీ సిబ్బంది బోడ బాబు, ఏదు జహంగీర్‌ ,బొమ్మేల రాంచేందర్‌ తదితరులు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్‌ : తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన అమరవీరులకు, ఆలేరు పట్టణంలో గురువారం , ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌లో బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆలేరు పట్టణ మున్సిపల్‌ చైర్మన్‌ వస్పరీ శంకరయ్య, హాజరై అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల పాత్ర మరువ లేనిదని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, పట్టణ నాయకులు, కార్యకర్తలు, మహేంద్ర యువసేన సభ్యులు పాల్గొన్నారు.
మోత్కూరు:తెలంగాణ రాష్ట్ర సాధనలో కాసోజు శ్రీకాంతాచారి త్యాగం మరువలేనిదని, ఆయన త్యాగం ఎంతోగొప్పదని మోత్కూరు జడ్పీటీసీ గోరుపల్లి శారదసంతోష్‌ రెడ్డి, ఎంపీపీ రచ్చ కల్పనలక్ష్మీ నర్సింహారెడ్డి, మున్సిపల్‌ చైర్మెన్‌పర్సన్‌ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గురువారం శ్రీకాంత్‌ చారి స్వగ్రామం మోత్కూరు మండలం పొడిచేడుగ్రామంలో శ్రీకాంత్‌ చారి విగ్రహానికి, ప్రభుత్వ కార్యాలయాల్లో అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పొడిచేడుకార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ కొణతం యాకూబ్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పొన్నెబోయినరమేష్‌, సర్పంచ్‌ పేలపూడి మధు, ఉపసర్పంచ్‌ కప్పె వెంకటేష్‌, సింగిలిండో వైన్‌ చైర్మెన్‌ పేలపూడివెంకటేశ్వర్లు, పి.సత్యనారాయణచౌదరి, గ్రామశాఖ అధ్యక్షుడు బోయపల్లి సైదులు, మహిళా అధ్యక్షురాలు మల్లం అనిత, జిట్ట లక్ష్మయ్య, పానుగుల విష్ణుమూర్తి, మల్లం సైదులు, కప్పె మల్లేష్‌, డి.యాదగిరి, బి.నర్సయ్య, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
మండల పరిషత్‌ కార్యాలయంలో, మోత్కూరు మున్సిపల్‌ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి అమరుల సంస్మరణ తీర్మానం చదివి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రచ్చ కల్పనలక్ష్మీ నర్సింహారెడ్డి, ఎంపీడీవో పోరెడ్డి మనోహర్‌ రెడ్డి, తహసీల్దార్‌ షేక్‌ అహ్మద్‌, మున్సిపల్‌ చైర్మన్‌ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి, వైస్‌ చైర్మన్‌ బి.వెంకటయ్య, కమిషనర్‌ సి. శ్రీకాంత్‌, కౌన్సిలర్లు బొడ్డుపల్లి కల్యాణ్‌ చక్రవర్తి, పురుగుల వెంకన్న, గుర్రం కవిత, లెంకల సుజాత, పి.ఆనందమ్మ, ఎండి.షాహిన్‌ సుల్తాన, జూనియర్‌ అసిస్టెంట్‌ ఆర్‌.ప్రభాకర్‌ రెడ్డి, ఏపీఎం కరుణాకర్‌, అంగన్వాడి సూపర్‌ వైజర్‌ కె.మంగమ్మ, మదర్‌ డెయిరీ డైరెక్టర్‌ రచ్చ లక్ష్మీ నర్సింహారెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్‌, బీసీ సెల్‌ అధ్యక్షుడు పానుగుల విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు పట్టణం లోని స్తూపం వద్ద నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా చైర్మన్‌ ఎరుకల సుధా హెమెందర్‌ గౌడ్‌ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు.ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ మేడబోయిన కాటంరాజు ,కౌన్సిలర్లు గౌళికార్‌ అరుణ రాజేష్‌, బూడిది సురేందర్‌ ,సీస విజయలక్ష్మి కష్ణ ,బిట్టు సరోజ హరీష్‌ ,తాళ్లపల్లి నాగరాజు ,బబ్బురి మౌనిక శ్రీధర్‌ కోఆప్షన్‌ సభ్యులు పేరబోయిన పెంటయ్య ,సయ్యద్‌ బాబా ,మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.