ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్న సీఎం: కేటీఆర్

– ఐదు నెలలు గడుస్తున్న అమలు కానీ ఆరు గ్యారెంటీలు…
– ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ 
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
ఊసరవెల్లి ఎలాగైతే రంగులు మారుస్తుందో అలాగే తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీల తేదీని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మార్చుకుంటూ పోతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తంగళ్ళపల్లి మండల టిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని సోమవారం మండలంలోని  ఎస్ ఎస్ గార్డెన్లో నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ఐదు నెలలు గడుస్తున్న ఇప్పటివరకు ఏ ఒక్క హామీ అమలు కాలేదని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలలో అమలు చేయడానికి ఊసరవెల్లి లాగా తేదీలను మార్చుకుంటూ పోతున్నారు తప్ప అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ ను నమ్మి ఓట్లేసిన తెలంగాణ రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచారన్నారు. రైతులకు ఏమి చేయకుండానే రైతు భరోసా ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. హైదరాబాదును కేంద్ర ప్రాలిత ప్రాంతంగా చేయాలని బిజెపి ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. ఇప్పటి పార్లమెంటు ఎన్నికల్లో 12 ఎంపీ సీట్లు గెలిస్తే ఆరు నెలల్లో రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారన్నారు. గత పది సంవత్సరాల కాలంలో నేత కార్మికుల ఆత్మహత్యలు లేని సిరిసిల్లగా తీర్చిదిద్దితే… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యాయని విమర్శించారు. నేత కార్మికులకు అండగా ఉండే పార్టీ ఏకైక పార్టీ గులాబీ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అనామకున్ని అభ్యర్థిగా ప్రకటించారు. కానీ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ కండువా లేకపోతే అభ్యర్థిని ఏ ఒక్కరు కూడా గుర్తుపట్టలేరని ఎద్దేవా చేశారు. పదేళ్ల నిజానికి, పదేళ్ల విషానికి, 150 రోజుల  అబద్దానికి మధ్య జరుగుతున్న పోటీ అని కేటీఆర్ వివరించారు. బిఆర్ఎస్ ను నిజంతో.. బిజెపిని విషంతో… కాంగ్రెస్ ను అబద్ధంతో.. కేటీఆర్ పోల్చారు. ముడిచాము లేదాముడి చమురు అంతర్జాతీయంగా తగ్గుముఖంలో ఉన్న రూ.30లక్షల కోట్లు పెట్రోల్,డీజిల్ ధరలు పెంచి ప్రజల వద్ద నుండి వసూలు చేసి అదానీ,అంబానీలకు బిజెపి ప్రభుత్వం దోచి పెట్టారన్నారు.