అచ్చంపేటపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సీఎం: ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

నవతెలంగాణ – అచ్చంపేట 
నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గంలో రెండు ముఖ్యమైన రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ కి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివేదిక సమర్పించారని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. మంత్రి నితిన్ గడ్కారీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.రానున్న రోజుల్లో అచ్చంపేట మీదుగా మరో రెండు జాతీయ రహదారులు.
1.బెంగళూర్ – హైదరాబాద్  జాతీయ రహదారి మధ్యలో ఉన్న భూత్పూర్ రహదారిని వయా నాగర్ కర్నూల్ – అచ్చంపేట – మన్ననూర్ – మద్దిమడుగు – గంగాలకుంట ఆంధ్రప్రదేశ్  శ్రీగిరిపాడు  వరకు  జాతీయ రహదారిగా  పొడిగించాలని నివేదిక లో పేర్కొన్నారు.రానున్న రోజుల్లో  కృష్ణ నది పైన వంతెన నిర్మాణం చేపట్టి, మద్దిమడుగు – మాచర్ల రహదారి ఏర్పాటుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
2.నల్లగొండ – దేవరకొండ – డిండి – అచ్చంపేట – బల్మూర్ – లింగాల – కొల్లాపూర్ – పెంట్లవెల్లి – కొల్లాపూర్ – అలంపూర్ –  పుల్లూర్ ( కర్నూల్) రహదారిని జాతీయ రహదారిగా అప్ గ్రేడ్ చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ కి నివేదిక లో పొందుపరిచారు. నల్లమల్ల ప్రాంతం వెనుకబడిన అచ్చంపేట నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినందుకు ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వంశీకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.