మాజీ మంత్రివర్యులు బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.