పోలీసు అకాడమీలో పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌.. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ పోలీసు అకాడమీలో పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అకాడమీలో 547 సబ్‌ ఇన్‌స్పెక్టర్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ నిర్వహించారు. 145 మంది మహిళలు సహా 547 మంది ఎస్సైలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కమాండర్‌గా మహిళా ఎస్సై భాగ్యశ్రీ వ్యవహరించారు.