సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

CM Relief Fund check handed over by MLAనవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ గ్రామానికి చెందిన మహిళ లబ్ధిదారు రాలికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు అందజేశారు. అనారోగ్యాల పాలై ఆసుపత్రిలో ఖర్చులు పెట్టిన డబ్బులు ఎమ్మెల్యే సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు ఆ మహిళా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ చెక్కు పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సచిన్ మైనారిటీ సెల్ మండల నాయకులు జావిద్ పటేల్ మద్నూర్ మండల మాజీ ఎంపీపీ ప్రజ్ఞ కుమార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బండి వార్ గోపి బండి వార్ హనుమాన్లు వీరితోపాటు లబ్ధిదారులు కుటుంబీకులు తదితరులు పాల్గొన్నారు.