సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండలంలోని అరూర్ కు చెందిన చిలుకమర్రి శ్రీనివాసచారి ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందడంతో వారికి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 34 వేల రూపాయల చెక్కును శుక్రవారం డిసిసి ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి శుక్రవారం అందజేశారు.ఈ కార్యక్రమంలో బుర్ర నర్సింహా, వెలిమినేటి సురేష్,సుంకిశాల పరమేష్,బండారు నర్సింహారెడ్డి, కొడితల కరుణాకర్,దామెర అంజయ్య,బత్తిని వెంకటేష్,కేదారి నరేష్,రెబ్బసు నరేష్,పులగల స్వామి,జావీద్ పాషా తదితరులు పాల్గొన్నారు.