సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన

CM Relief Fund checks distributed– ఎమ్మెల్యే జయవిర్
నవతెలంగాణ – పెద్దవూర
సాగర్ నియోజకవర్గంలో పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులనుఎమ్మెల్యే కుందూరు జయవిర్ రెడ్డి రెడ్డి  చేతుల మీదుగా అందజేశారు. సోమవారం పెద్దవూర మండలం నాగార్జున సాగర్ లోని తన నివాసం  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గం లోని పలు మండలాలకు చెందిన లబ్దిదారులకు చెక్కులను ఎమ్మెల్యే  పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తోందని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో వైద్యం, విద్యకు సీఎం  పెద్దపీట వేస్తున్నారని అన్నారు.