సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత..

నవతెలంగాణ – మునుగోడు
అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి అండగా ఉండాలని లక్ష్యంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను బుధవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే ప్రత్యేక క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాల తోపాటు తమ సొంత ఆర్థిక సాయంతో ఎంతోమంది పేద ప్రజలకు ప్రాణాలు పోసిన గొప్ప నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని అన్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవికి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సాగర్ల లింగస్వామి , మాజీ సర్పంచ్ మిర్యాల వెంకన్న ,  యువజన కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షుడు పాల్వాయి జితేందర్ రెడ్డి , మాజీ కాప్షన్ నెంబర్ ఎండి అన్వర్ , మర్నేని గ్రేగోరి , కూరపాటి సాగర్ ,మక్కేన సాగర్ , గడగోటి మైకల్ ఈద పవన్ తదితరులు పాల్గొన్నారు.