బొల్లారంలో సీఎం సహాయనిధి..

CM relief fund in Bollaram..– చెక్కును అందించిన కాంగ్రెస్ పార్టీ నేతలు..
నవతెలంగాణ – వేములవాడ రూరల్ 
పేద ప్రజల సంక్షేమం కోసమే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందని జిల్లా డిసిసి కార్యదర్శి బాలసాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారంవేములవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామానికి చెందిన చిత్తరి ఎల్లవ్వ కుమారుడు సాయి కృష్ణకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి  అందించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు బాలసాని దశరథం, సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిలక ప్రభాకర్, సుద్దాల కైలాసం, బుర్ర నారాయణ, రొండి రాజు తదితరులు పాల్గొన్నారు.