– మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ దేవునూరి పోచయ్య..
నవతెలంగాణ – తొగుట
సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరమని మార్కె ట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ దేవునూరి పోచయ్య అన్నారు. బుధవారం మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులతో కలిసి బాది తునికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉప యోగపడుతుందని అన్నారు. గ్రామానికి చెందిన నరేండ్ల భాగ్యలక్ష్మి కి రూ. 57,500/- చెక్కును అందజేశామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యం లో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకు వెళ్లడానికి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఎంతగా నో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. చెక్కు తీసుకున్న లబ్ధిదారులు శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు కనికి స్వామి, ఐఎన్సివి సోషల్ మీడియా కన్వీనర్ బైతిప్రవీణ్, బైతి అరవింద్, నర్మెట ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.