
తెలంగాణ రాష్ట్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ప్రజల ఆరోగ్యానికి ఎంతో ఆశగా నిలుస్తుందని డోంగ్లి మండలంలోని పెద్ద టాక్లి గ్రామ సర్పంచ్ రాజాబాయి విలాస్ తెలిపారు ఆ గ్రామంలో గురువారం నాడు లబ్ధిదారునికి సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా మంజూరైన 60 వేల రూపాయల చెక్కును ఆమె అందజేశారు లబ్ధిదారుడు అఫ్సర్ సాబ్ కు అందజేసిన కార్యక్రమంలోఉప సర్పంచ్ యాదవ్ రావు పటేల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అహేమద్ హుస్సేన్, సామజిక కార్యకర్త సాయలు గొండ గోరంచే, వార్డ్ మెంబెర్ షాదులసాబ్ వివో ఏ మాధవ్, కారోబార్ ఆమజాద్ పటేల్, విక్రమ్, అఫ్సర్ సాబ్ తదితరులు పాల్గొన్నారు.