నవతెలంగాణ – (వేల్పూర్) ఆర్మూర్
మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో శనివారం ఎస్సీ (ఏబిసి) వర్గీకరణకు వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ గ్రామ 88 సంఘ సభ్యులు మాట్లాడుతూ.. మన దేశంలో ఏ రాష్ట్రాలు చేయకుండానే పాలన చేతగాని, భూతు మాటల,అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అతి ఉత్సాహంతో అన్నదమ్ముల కలిసి ఉన్న మాల మాదిగలను విడదీసిన ఈ చేతగాని ముఖ్యమంత్రి అని అన్నారు.