అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత సీఎం రేవంత్ దే

CM Revanth is credited with making the impossible possible– కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కమలాకర్
నవతెలంగాణ – దుబ్బాక రూరల్ 
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కమలాకర్ అన్నారు. శుక్రవారం అక్బర్పేట్ భూంపల్లి మండల పరిధిలోని ప్రోతరెడ్డి పేట గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేసిన సందర్భంగా సీఎం చిత్రపటానికి రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరంగల్ రైతు డిక్లరేషన్లో రైతులకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తూచా తప్పకుండా నెరవేర్చిందన్నారు. రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వానికి తాము కృతజ్ఞతలు తెలుపుతున్నమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి నవీన్, గ్రామ అధ్యక్షులు మేదరి కిషోర్, సినియర్ నాయకులు బోయిని పరశురాములు, బండారి ఆశ, జిన్న దుబ్బయ్య, బాలగౌడ్, నర్సింలు,మైపాల్ యాదవ్,గోప రాజు, చిట్టబోయిన బాలచంద్రం, సిద్ధిరాములు, తదితరులు పాల్గొన్నారు.