రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న సీఎం రేవంత్..

CM Revanth is giving importance to the welfare of farmers.– మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావ్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ కనుకుంట్ల రేఖ బాబురావ్ అన్నారు.   శుక్రవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడి ఏడాది పూర్తి అయ్యిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయవత్సవాలలో  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుతుందని అన్నారు. అందులో భాగంగా భువనగిరి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో, పట్టణాలలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలును ప్రజలను వివరించాలని అన్నారు. అక్కాచెల్లెళ్లకు ఉచిత బస్సు ప్రయాణం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని అన్నారు. ప్రతి ఇంట్లో గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని అన్నారు. గత పది సంవత్సరాలలో గ్యాస్ ధర 1200 రూపాయలు అయిందని, ప్రజా పాలన ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తుందని అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ లో రైతులకు రుణమాఫీ చేసిందని అన్నారు. మిగిలిపోయిన వాళ్లకు కూడా డిసెంబర్లో తప్పకుండా రుణమాఫీ అవుతుందని అన్నారు. మహిళా సంఘాలను ప్రోత్సహించి మహిళలకు పెద్దపీట కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తుందని అన్నారు.