– విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి
నవతెలంగాణ – కంఠేశ్వర్
పెన్షన్ దారులను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని ప్రజా కోర్టులో రేవంత్ రెడ్డిని పెన్షన్ దారులు నిలబెడతారని విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ అన్నారు. ఈ మేరకు శుక్రవారం వికలాంగుల హక్కుల పోరాట సమితి పెన్షన్ పెంపుకై చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు 5వ రోజుకు చేరుకుంది. ఈ 5వ రోజ జరుగుతున్న రిలే నిరాహారదీక్షలకు విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడిచిన పెంచుత అన్న అన్ని సామాజిక పెన్షన్లను పెంచకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులకు ఇంకా ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. వికలాంగుల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చెయ్యాలి. వికలాంగులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి హామీలను అమలుపరచాలి. లేకుంటే నవంబరు 26న పెన్షన్ దారుల మహా గర్జన పేరుతో ఇంద్ర పార్క్ లో లక్షలాది పెన్షన్ దారులతో అన్ని రాజకీయ పార్టీలను అఖిలపక్షంగా భాగస్వామ్యం చేసి రేవంత్ రెడ్డి మీద యుద్ధం ప్రకటిస్తామని హెచ్చరించారు. అనంతరం ఎన్టీఆర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. సుమారు 20 నిమిషాల పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. 20 నిమిషాల పాటు రెండుు వైపులా రోడ్డుపై భీష్మించి నుంచి కూర్చున్నారు. ఈ దీక్షలో విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు కంటేశ్వర్ బీరప్ప, విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల నారాయణ జిల్లా నాయకులు విహెచ్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ సలీం , మహిళా విభాగం అధ్యక్షురాలు చిట్టి కృష్ణవేణి భామని పోశెట్టి గంధాల గంగాధర్ శ్రీనివాస్ యాదవ్ తిరుమల నాయక రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.