నవతెలంగాణ – భగత్ నగర్ : కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డిని వారి నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని పోలింగ్ జరిగిన తీరు, సరళి గురించి చర్చించడం జరిగిందని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ ఏడు నియోజకవర్గ ల ఎమ్మెల్యేలు ఇన్చార్జిలు, స్థానిక నాయకులను కలుపుకొని సమన్వయంతో లోక్ సభ ఎన్నికల్లో గట్టిగా పోరాడారని సీఎం రేవంత్ రెడ్డి వెలిచాలను అభినందించారు.