బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy is the beacon of hope for the weaker sections– జిల్లా యువజన అధ్యక్షులు మహమ్మద్ ఇలియాస్
నవతెలంగాణ –  కామారెడ్డి
కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 55వ పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్  అధ్యక్షులు కైలా శ్రీనివాస్, జిల్లా యూత్ అధ్యక్షుడు మహమ్మద్ ఇలియాస్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యువజన అధ్యక్షులు మహమ్మద్ ఇలియాస్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఎల్లప్పుడూ ప్రజా సేవలో ఉంటూ ప్రజల మధ్య తిరిగే నాయకుడని జడ్పిటిసి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 20 ఏండ్లలో ఎంతో కష్టపడి సమర్థవంతంగా పదవులు నిర్వహించి ఉన్నతమైన ముఖ్యమంత్రి పదవిని చేపట్టారన్నారు.  ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి  బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎన్నో పథకాలను అమలు చేశారన్నారు. దేశంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని ఒక సమర్ధవంతుడు, ధైర్యం గల రాహుల్ గాంధీ కుల గణన చేపట్టారాని,రాహుల్ గాంధీ  సాహసం చేస్తే దానిని రేవంత్ రెడ్డి  అందిపుచ్చుకొని ధైర్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించే కార్యక్రమం చేపట్టారని తెలిపారు. ఇది కేవలం సమర్థవంతుడైన ధైర్యం గల రేవంత్ రెడ్డి వాళ్ళనే సాధ్యమయ్యే పని అని, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రేవంత్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకొని రేవంత్ రెడ్డి ఆశయాలను ఆలోచన ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సేవ చేయాలని రేవంత్ రెడ్డి చేసే ప్రతి పనిలో ఆయనకు అండగా నిలబడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు పండ్ల రాజు, కౌన్సిలర్ పాత శివ కృష్ణమూర్తి, నాయకులు గూడెం శ్రీనివాస్ రెడ్డి, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, గంగాధర్, గొడుగుల శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.